Prisoner: విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

Remand prisoner died in Vijayawada Sub Jail
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న‌ ఖైదీ మృతిచెందడం క‌ల‌క‌లం రేగింది. విజ‌య‌వాడ వ‌న్‌టౌన్ గొల్ల‌పాలెంకు చెందిన బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అనే ఆటో డ్రైవ‌ర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో న్యాయ‌స్థానం రిమాండ్ విధించింది. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్న అత‌డు గురువారం ఉద‌యం త‌న బ్యార‌క్‌లో స్పృహ త‌ప్పిప‌డి ఉండ‌గా పోలీసులు గుర్తించారు. దాంతో వెంట‌నే తిల‌క్‌ను పోలీసులు ఆసుపత్రికి త‌ర‌లించారు. కానీ, అప్ప‌టికే అత‌డు మృతిచెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. అస‌లు అత‌డు ఎలా మృతిచెందాడు? అన్నది తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Prisoner
Vijayawada Sub Jail
Dead
Andhra Pradesh

More Telugu News