ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న క్రిష్‌

Director Krish withdraws anticipatory bail petition
  • టాలీవుడ్ ను మరోసారి షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం
  • రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన క్రిష్
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రాడిసన్ హోటల్ లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్ పేరు రావడంలో అందరూ ఉలిక్కి పడ్డారు. క్రిష్ ను కూడా నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను నిన్న జస్టిస్ జి.రాధారాణి విచారించారు. ఈ సందర్భంగా క్రిష్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ముందస్తు బెయిల్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. క్రిష్ కు నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ గా తేలింది. దీంతో, బెయిల్ పిటిషన్ ను క్రిష్ వెనక్కి తీసుకున్నారు.
Advertisement
Director Krish
Tollywood
Drugs

More Telugu News