ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులకు 8న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు మార్గం
- ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం
- రూ.2000 కోట్ల ఖర్చుతో 5.5 కిలో మీటర్ల మేర మార్గం
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్గంలో ఐదు స్టేషన్లు వుంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు కానుంది.