వచ్చే నెలలో ప్రియుడిని పెళ్లాడబోతున్న తాప్సీ
- గత పదేళ్లుగా మథియాస్ తో డేటింగ్ లో ఉన్న తాప్సీ
- డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనున్న వివాహం
తాప్పీ ప్రియుడు మథియాస్ వివరాల్లోకి వెళ్తే... ఆయన డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. 2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ రిలేషన్ ప్రారంభమయింది.