మా వ్యూహం మాకుంది... టీడీపీ-జనసేన సీట్ల పంపకంపై పురందేశ్వరి స్పందన
- నిన్న సీట్ల పంపకంపై టీడీపీ, జనసేన ప్రకటన
- వాళ్లు అన్ని సీట్లను ప్రకటించలేదు కదా అంటూ పురందేశ్వరి వ్యాఖ్యలు
- తమ పొత్తును బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని వెల్లడి
"మా ప్రణాళిక మాకుంది... అయినా టీడీపీ, జనసేన అన్ని సీట్లను ఇంకా ప్రకటించలేదు కదా. కొన్ని సీట్లనే ప్రకటించారు. బీజేపీ జాతీయ నాయకత్వం పొత్తు ఖరారు చేస్తే, అప్పుడు సీట్ల గురించి ఆలోచిస్తాం... ఎక్కడ పోటీ చేయాలన్నదాని గురించి ఆలోచిస్తాం. అప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో బూత్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాం" అని పురందేశ్వరి స్పష్టం చేశారు.