గుండెపోటుతో బాలీవుడ్ సీనియర్ నటుడు రితురాజ్ కన్నుమూత

TV actor Rituraj Singh dies of sudden cardiac arrest
  • గత కొంతకాలంగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న రితురాజ్
  • ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
  • షారూఖ్ ఖాన్‌కి రితురాజ్ సన్నిహిత మిత్రుడు 
  • షారూఖ్ వల్లే సినిమాలు, సీరియళ్లలో నటన
బద్రీనాథ్ కీ దునియా, తునివు, యారియన్ 2 వంటి చిత్రాలతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించిన సీనియర్ నటుడు రితురాజ్ సింగ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. చివరిసారి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే ఓటీటీ షోలో కనిపించిన ఆయన అనుపమా, బనేగీ అప్నీ బాత్, జ్యోతి, హిట్లర్ దీదీ వంటి సీరియళ్లలోనూ నటించారు. 

గత కొన్ని రోజులుగా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న రితురాజ్ కొన్నాళ్ల క్రితం ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు, నటుడు అమిత్ బెహల్ ధ్రువీకరించారు. రితురాజ్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

రితురాజ్, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఇద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. బ్యారీ జాన్స్ థియేటర్ యాక్షన్ గ్రూప్ లో కలిసి నాటకాలు వేసేవారు. తర్వాత షారూఖ్ హీరోగా మారగా, రితురాజ్‌ను కూడా ముంబై రప్పించారు. అలా సినిమాలు, సీరియళ్లలో రితురాజ్ పరిచయమయ్యారు.
Advertisement
Rituraj Singh
Bollywood
Cardiac Arrest
Bollywood News

More Telugu News