డెంగీతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ
Advertisement

డెంగీతో బాధపడుతున్న మంత్రి కొండా సురేఖ

Konda Surekha suffering from Dengue fever
  • గత ఐదు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న కొండా సురేఖ
  • రెండు, మూడు రోజుల్లో ఆమె కోలుకుంటారన్న వైద్యులు  
  • ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి 
తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. డెంగీ జ్వరంతో ఆమె బాధపడుతున్నారు. తన మంత్రిత్వ శాఖల కార్యక్రమాలను హైదరాబాద్ లోని తన నివాసం నుంచే ఆమె పర్యవేక్షిస్తున్నారు. జ్వరంతో గత ఐదు రోజులుగా ఆమె బాధ పడుతున్నారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా డెంగీ అని బయటపడింది. జ్వరంతో బాధ పడుతూనే మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

Advertisement
Konda Surekha
Congress
Sick

More Telugu News