సన్నీ లియోన్ పేరుతో పోటీ పరీక్షల హాల్ టికెట్
- అడ్మిట్ కార్డుపై ఆమె పేరు, ఫొటో, ఇతర వివరాలు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో
- కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
కాగా ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డ్ (UPPRB) వెబ్‌సైట్‌లో సన్నీ లియోన్ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తించారు. అడ్మిట్ కార్డు ప్రకారం సన్నీ లియోన్ పరీక్షా కేంద్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా తహసిల్‌లో ఉన్న సోనేశ్రీ మెమోరియల్ గర్ల్స్ కాలేజీలో ఉంది. ఈ ఘటనపై కన్నౌజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. కాగా ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాష్ట్రవ్యాప్తంగా 75 జిల్లాల్లో 2,385 పరీక్షా కేంద్రాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష జరిగింది.