శ్రీలీల చేతుల మీదుగా 'గాళ్ ఫ్రెండ్ మండి' కొత్త బ్రాంచి ప్రారంభోత్సవం... ఫొటోలు ఇవిగో!
- బంజారాహిల్స్ లో గాళ్ ఫ్రెండ్ మండి ప్రారంభోత్సవం
- ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీలీల
- తాను ఫుడ్ లవర్ నని వెల్లడించిన యువ హీరోయిన్
ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో మాట్లాడారు. తాను ఫుడ్ లవర్ నని వెల్లడించారు. గాళ్ ఫ్రెండ్ మండి కొత్త బ్రాంచి తన చేతులమీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు.
ఈ క్రమంలో గాళ్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్ యజమాని కదిరేశన్ మాట్లాడుతూ... తమకు ఇప్పటికే గచ్చిబౌలి, మాదాపూర్ లో బ్రాంచిలు ఉన్నాయని, ఇప్పుడు బంజారాహిల్స్ లోనూ బ్రాంచి ఓపెన్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తమ వద్ద అన్ని రకాల నాన్ వెజ్, వెజ్ ఐటమ్స్ లభిస్తాయని చెప్పారు.


