తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
Advertisement

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ

12 IPS Officers Transferred In Telangana
  • పన్నెండు మంది అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి 
  • మల్టీ జోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుదీర్ బాబు బదిలీ
తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను రేవంత్ రెడ్డి బదిలీ చేసింది. పన్నెండు మంది అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్ బాబును బదిలీ చేసింది. ఇటీవలే ఆయన రాచకొండ సీపీగా వెళ్లారు. అలాగే ఆయనకు మల్టీ జోన్-1 పూర్తిస్థాయి అదనపు ఐజీగా కూడా బాధ్యతలను అప్పగించింది. రాచకొండ సీపీగా తరుణ్ జోషికి బాధ్యతలు అప్పగించింది. రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులును, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్‌ను నియమించింది. 

బదిలీ అయిన వారి వివరాలు...

రాచకొండ సీపీగా తరుణ్ జోషీ
రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్
సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్
ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా ఉదయ్ కుమార్
ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్
హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మి
మల్టీజోన్-2 ఐజీగా రాచకొండ సీపీ సుధీర్ బాబు బదిలీ
Advertisement
Telangana
ips

More Telugu News