అరబ్ దేశాల్లో మొట్టమొదటి హిందూ దేవాలయం... ఈ నెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- అబుదాబిలో హిందూ దేవాలయం
- 27 ఎకరాల్లో నిర్మితమైన ఆలయం
- సుమారు రూ.700 కోట్లతో నిర్మాణం
కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు మధ్య ప్రాచ్య దేశాల్లో ఇదే మొదటి హిందూ దేవాలయం కానుంది. 27 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఈ ఆలయ బడ్జెట్ సుమారు రూ.700 కోట్లు అని మీడియా కథనాలు చెబుతున్నాయి.
2015లో ప్రధాని మోదీ యూఏఈ పర్యటన సందర్భంగా అక్కడి పాలకులు ఈ ఆలయానికి భూమి కేటాయించారు. 1980లో ఇందిరా గాంధీ పర్యటించిన తర్వాత యూఏఈలో పర్యటించిన భారత ప్రధాని మోదీనే. అందుకే 2015 నాటి మోదీ పర్యటన చారిత్రాత్మకంగా మిగిలిపోయింది.