భారతీరెడ్డితో కలిసే నా భర్త అనిల్ సోనియాగాంధీ వద్దకు వెళ్లారు: వైఎస్ షర్మిల
- అనునిత్యం ప్రజల్లో ఉండటం వైఎస్సార్ మార్క్ అన్న షర్మిల
- కడపకు జగన్ చేసిందేమీ లేదని విమర్శ
- షర్మిలను సీఎం కావాలనుందని తన భర్త చెప్పినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
ఇదే సమయంలో తన వదిన వైఎస్ భారతి అంశాన్ని కూడా ఆమె తీసుకొచ్చారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా తన భర్త అనిల్ కుట్రలు చేశారనే ఆరోపణలపై మండిపడ్డారు. జగన్ ను బయటకు రానివ్వొద్దని, షర్మిలను సీఎం చేయాలని లాబీయింగ్ చేసినట్టు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిలకు సీఎం కావాలనుందని, ప్రణబ్ ముఖర్జీతో, సోనియాతో తన భర్త చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భారతీరెడ్డితో కలిసే సోనియాగాంధీ వద్దకు అనిల్ వెళ్లారని తెలిపారు. మరి సోనియాతో తన భర్త ఈ విషయం గురించి భారతీరెడ్డి ముందు మాట్లాడారా? లేక వెనుక మాట్లాడారా? అని ప్రశ్నించారు. తనకు పదవులే కావాలనుకుంటే తన తండ్రి సీఎం అయినప్పుడే తీసుకునేదాన్నని చెప్పారు.