రోహిత్ శర్మ ఇన్‌స్టా పోస్టుపై సురేష్ రైనా కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్‌

Suresh Raina commented on Rohit Sharma Insta post and Raina comment went viral
  • ఆఫ్ఘనిస్థాన్‌పై మూడవ మ్యాచ్ అనంతరం ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసిన రోహిత్
  • సెంచరీతో చెలరేగడంతో ‘అందుకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అంటారు’ అని సురేష్ రైనా కామెంట్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మాజీ ఆటగాడి కామెంట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 కెరియర్ ముగిసిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్‌పై మూడవ టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ మూడో మ్యాచ్‌లో కేవలం 69 బంతుల్లో 121 పరుగులు బాదాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ రూపంలో ఫలితం తేలగా సూపర్ ఓవర్‌లో కూడా హిట్‌మ్యాన్ అదరగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రోహిత్ శర్మ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ‘ఆస్వాదించాను’ అని ఈ క్యాప్షన్ ఇచ్చాడు. 

అయితే రోహిత్ శర్మ పోస్టుపై మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికరంగా స్పందించాడు. ‘ ఈ కారణంగానే ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్’, వెల్‌డన్’ అని రైనా కామెంట్ చేశాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలక్టర్లు ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ ఒక మ్యాచ్‌లో రాణించగా, కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో వీరిద్దరినీ టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేయడం అంత తెవివైన నిర్ణయం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
Advertisement
Suresh Raina
Rohit Sharma
Cricket
Team India
Instagram

More Telugu News