కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి అందరికీ అర్థమవుతోంది: కిషన్ రెడ్డి
- ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించిందని కిషన్ రెడ్డి ఆగ్రహం
- రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ బహిష్కరణ నిర్ణయం తీసుకుందని ఆరోపణ
- కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అన్న కిషన్ రెడ్డి
కేవలం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మాత్రమే కాంగ్రెస్ బహిష్కరించలేదని... ఇదివరకు జీ20, పార్లమెంట్ అఖిలపక్షం, ఎన్నికల కమిషన్ సమావేశాలను కూడా బహిష్కరించిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఇలాంటి బహిష్కరణలు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అన్నారు. రామమందిర నిర్మాణ ఆహ్వానాన్ని తిరస్కరించడం దివాలాకోరు నిర్ణయమన్నారు.