రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పంచుకున్న కేశినేని నాని
- టీడీపీకి గుడ్ బై చెప్పిన కేశినేని నాని
- నేడు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా
- రాజీనామా లేఖను ఈ-మెయిల్ లో పంపిన నాని
- తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్పీకర్ కు విజ్ఞప్తి
"విజయవాడ ఎంపీగా నా పదవికి రాజీనామా చేశాను. రాజీనామా లేఖను గౌరవనీయ లోక్ సభ స్పీకర్ కు ఈ-మెయిల్ చేశాను. తక్షణమే నా రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశాను" అంటూ కేశినేని నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, తన రాజీనామా లేఖను కూడా పంచుకున్నారు. కాగా, కేశినేని నాని ఒకట్రెండు రోజుల్లో వైసీపీలో చేరే అవకాశాలున్నాయి.