'వ్యూహం' సినిమా విడుదలపై విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
Add ap7am to your home Screen

'వ్యూహం' సినిమా విడుదలపై విచారణను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

TS High Court adjourns hearings on Vyuham movie release petition
  • సినిమా విడుదలపై పిటిషన్ ను ఈరోజు విచారించిన హైకోర్టు
  • సెన్సార్ సర్టిఫికెట్, రికార్డులను కోర్టుకు సమర్పించిన సెన్సార్ బోర్డు
  • రికార్డులను పరిశీలించిన తర్వాత విచారణ జరుపుతామన్న హైకోర్టు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమా నిర్మాత వేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డును పరిశీలించిన తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రేపు మరోసారి విచారణ చేపడతామని చెప్పింది. 

ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లను కించపరిచేలా ఉందంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర నిర్మాత అప్పీల్ చేశారు.
Advertisement
Vyuham Movie
TS High Court
Ram Gopal Varma
Tollywood

More Telugu News