భారీ వసూళ్ల దిశగా కన్నడ మూవీ 'కాటేరా'
- డిసెంబర్ 29వ తేదీన విడుదలైన 'కాటేరా'
- కన్నడలో భారీ హిట్ గా నిలిచిన సినిమా
- హీరో దర్శన్ కెరియర్లోనే భారీ వసూళ్లు
- 1970లో హంపీలో జరిగిన సంఘటన కథకి ఆధారం
45 కోట్ల బడ్జెట్ తో రాక్ లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ టైమ్ కి హైప్ పెంచుతూ వెళ్లారు. అందుకు తగినట్టుగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. దర్శన్ కెరియర్ లోనే ఇది పెద్ద హిట్ అని చెబుతున్నారు.
తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1970లలో 'హంపీ'లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా నడిచే ఈ కథకి ఆడియన్స్ ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. కంటెంట్ పరంగా 'కేజీఎఫ్' .. 'కాంతార' సినిమాల సరసన ఈ సినిమా నిలిచిందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు వదులుతారనేది చూడాలి.