జాబు రావాలంటే బాబు రావాల్సిందే... మరి బాబు రావాలంటే...!: చంద్రబాబు

జాబు రావాలంటే బాబు రావాల్సిందే... మరి బాబు రావాలంటే...!: చంద్రబాబు

Chandrababu road show in Kuppam constituency
  • కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటన
  • శాంతిపురం, రామకుప్పం మండలాల్లో చంద్రబాబు రోడ్ షో
  • తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి
  • నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని ప్రకటన
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు కూడా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల్లో రోడ్ షోలలో పాల్గొన్నారు. 

ఈ సంరద్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉపాధి కోసం యువత ఎక్కడికీ వెళ్లనవసరంలేదని పేర్కొన్నారు. ఐదేళ్ల కాలవ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 

జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. మరి బాబు రావాలంటే మీరేం చేయాలి... టీడీపీ విజయం కోసం 100 రోజులు పనిచేయండి అని యువతకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన తిరగండి... ఫ్యానును చితక్కొట్టండి... ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలో ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement
Chandrababu
Road Show
Kuppam
TDP
Andhra Pradesh

More Telugu News