మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసిన ఐపీఎస్ నవీన్ కుమార్

IPS Naveen Kumar vacate Bhanvar Lal house
  • భన్వర్ లాల్ - నవీన్ కుమార్ మధ్య వివాదం
  • నవీన్ కుమార్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడని భన్వర్ లాల్ భార్య ఫిర్యాదు
  • తమ ఇంటిని ఆక్రమించే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు
మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్‌తో వివాదం... ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ఇంటిని... ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేశారు. తన ఇంటిని ఆక్రమించేందుకు నవీన్ కుమార్ తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించాడని భన్వర్ లాల్ భార్య మణిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు ఐపీఎస్ నవీన్‌ను విచారించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో... భన్వర్ లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న నవీన్ కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేశారు.
Go Back to Shorts
naveen kumar
ips
ias

More Telugu News