Atchannaidu: ఏపీ సీఎస్ కు అచ్చెన్నాయుడు లేఖ

Atchannaidu shot a letter to AP CS
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. లిక్కర్ విక్రయాలు, ఆదాయం వివరాలను వెబ్ సైట్  నుంచి తొలగించారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకతకు పాతరేస్తోందని విమర్శించారు. మొన్నటి వరకు జీవోలను రహస్యంగా ఉంచారని పేర్కొన్నారు. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని తన లేఖలో వివరించారు. వైసీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. మద్యం అమ్మకాలు, ఆదాయం వివరాలను వెబ్ సైట్ లో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Atchannaidu
AP CS
Letter
Liquor Data
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News