బాప్ రే.. కుక్కకు రూ.20 కోట్లా?
- హైదరాబాద్ ఈవెంట్ కు అత్యంత ఖరీదైన శునకం
- కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందినదని ఓనర్ వెల్లడి
- మియాపూర్ పెట్ క్లినిక్ వద్ద సెల్ఫీల కోసం ఎగబడ్డ డాగ్ లవర్స్
కాకసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకానికి కాడాబామ్ హైడర్ గా సతీశ్ నామకరణం చేశారు. ఈవెంట్ లో పాల్గొనే ముందు హెల్త్ చెకప్ కోసం మియాపూర్ లోని పెట్ క్లినిక్ కు తీసుకొచ్చారు. ఈ అరుదైన శునకం రాక గురించి ముందే సమాచారం ఉండడంతో పెట్ క్లినిక్ కు డాగ్ లవర్స్ పోటెత్తారు. ఈ శునకంతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కాగా, కాడాబామ్ హైడర్ వయసు మూడేళ్లని సతీశ్ చెప్పారు. దీనిని పోషించడానికి లక్షల్లో ఖర్చవుతుందని, రోజుకు మూడు కిలోల చికెన్ తింటుందని వివరించారు. హైడర్ పలు సినిమాల్లో నటించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరిగిన షోలలో పాల్గొందని సతీశ్ తెలిపారు.