Chandrababu: పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై చంద్రబాబు స్పందన

Chandrababu responds on MLC Sheikh Sabjee demise
షార్ట్స్‌లో చూడండి
పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. అంగన్ వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరం అని తెలిపారు. తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నానని చంద్రబాబు వివరించారు. ఈ విషాద సమయంలో సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. 

ఇవాళ ఏలూరులో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొన్న షేక్ సాబ్జీ... భీమవరం వెళుతుండగా, ఉండి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన ప్రాణాలు విడిచారు.
Go Back to Shorts
Chandrababu
Sheikh Sabjee
Death
Road Accident
PDF MLC
TDP
Andhra Pradesh

More Telugu News