ముంబైకి చేరుకున్న రామ్ చరణ్

Ramcharan arrives in Mumbai
  • హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన రామ్ చరణ్
  • ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న చరణ్
  • శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఉత్తరాదిన కూడా చరణ్ ను అభిమానిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు ఈరోజు హైదరాబాద్ నుంచి చరణ్ ముంబైకు బయల్దేరారు. కాసేపటి క్రితం ఆయన ముంబై చేరుకున్నారు. అయితే, ఏ పని మీద ఆయన ముంబైకి వెళ్లారనే విషయం తెలియాల్సి ఉంది.

చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. మార్చ్ ఆఖరికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Ramcharan
Tollywood
Bollywood
Mumbai

More Telugu News