Anju: పాకిస్థాన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన వివాహిత అంజు

Anju who married Pakistani man returns to India
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ లో ఉన్న ఫేస్ బుక్ లవర్ ను పెళ్లాడేందుకు గత జులైలో భారత్ ను వీడిన అంజూ గుర్తుండే ఉంటుంది. కన్నబిడ్డలను కూడా వదిలేసి ప్రియుడి కోసం పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడా అంజూ పిల్లల కోసం తిరిగి భారత్ వచ్చింది. వాఘా-అట్టారీ బోర్డర్ వద్ద ఆమె భారత్ లోకి ప్రవేశించింది. ఒక్కతే వచ్చిన అంజూ చేతిలో కొంత లగేజి మాత్రమే ఉందని, ఆమె ప్రశాంతంగా కనిపించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఆమె అమృత్ సర్ నుంచి ఢిల్లీ వెళ్లనుంది. 

అంజూ స్వస్థలం ఉత్తరప్రదేశ్. పెళ్లయ్యాక రాజస్థాన్ కు వెళ్లిపోయింది. అక్కడ పిల్లలు, భర్తతో కాపురం సాగిపోతుండగా... పాకిస్థాన్ కు చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. 2019లో మొదలైన అంజూ-నస్రుల్లా ఫేస్ బుక్ స్నేహం ప్రేమగా మారింది. దాంతో ప్రియుడ్ని ఎలాగైనా కలవాలని భావించిన అంజూ అందరినీ వదిలేసి పాకిస్థాన్ చేరింది. అక్కడి ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్ లో ఓ కుగ్రామంలో ఉండే తన ప్రియుడు నస్రుల్లాని కలిసి అతడిని పెళ్లాడింది. 

అంజూ వయసు 34 ఏళ్లు కాగా, నస్రుల్లా వయసు 29 సంవత్సరాలు. పెళ్లి తర్వాత అంజూ ఇస్లాం మతాన్ని అనుసరిస్తూ తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. కాగా, అంజూ భారత్ తిరిగి రావడంపై పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె తన కుమారుడు, కుమార్తెను చూశాక తిరిగి పాకిస్థాన్ వచ్చేస్తుందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం ఆమె వీసాను మరో ఏడాది పొడిగించినట్టు కూడా కథనాల్లో తెలిపారు.
Go Back to Shorts
Anju
India
Pakistan
Facebook

More Telugu News