Praveen Kumar: బాసర ట్రిపుల్ ఐటీలో ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య

Student commits suicide on Basara IIIT
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థ బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థి ప్రవీణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్. ఈ విద్యా సంవత్సరంలోనే బాసర ట్రిపుల్ ఐటీలో చేరాడు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని, ఇవాళ ఉదయం 10 గంటలకు అవుట్ పాస్ తీసుకున్నాడని వైస్ చాన్సలర్ వెల్లడించారు. ప్రవీణ్ కుమార్  హాస్టల్ బిల్డింగ్ లోని నాలుగో అంతస్తులో ఉరేసుకుని ఉన్న స్థితిలో కనిపించాడు. తన గదిలో కాకుండా మరో గదిలో  ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. 
Go Back to Shorts
Praveen Kumar
Suicide
IIIT
Basara
Telangana

More Telugu News