హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కే... ముంబయి ఇండియన్స్ కు నిరాశ!

Gujarat Titans retains Hardik Pandya
  • గతంలో ఏడు సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ కు ఆడిన పాండ్యా
  • గత రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వైనం
  • పాండ్యా కోసం రూ.15 కోట్లు చెల్లించేందుకు ముంబయి సిద్ధపడినట్టు వార్తలు
  • పాండ్యాను అట్టిపెట్టుకోవడం ద్వారా ప్రచారానికి తెరదించిన టైటాన్స్
ఐపీఎల్-2024 ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్ ప్రక్రియలో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ అట్టిపెట్టుకుంది. తాజా సీజన్ లోనూ హార్దిక్ పాండ్యానే గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. పాండ్యా నాయకత్వంలో ఆడిన తొలి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన గుజరాత్ టైటాన్స్, ఆ తరువాతి సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. 

ఈ నేపథ్యంలో, హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేయనుందంటూ ప్రచారం జరిగింది. పాండ్యాను రిలీజ్ చేసేందుకు గుజరాత్ ఫ్రాంచైజీకి ఏకంగా రూ.15 కోట్లు చెల్లించేందుకు ముంబయి ఇండియన్స్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, గుజరాత్ టైటాన్స్ వాటిన్నింటికీ తెరదించింది. హార్దిక్ పాండ్యాను ఈ సీజన్ కు కూడా అట్టిపెట్టుకుంటున్నట్టు ప్రకటించింది. అతడే తమ నాయకుడు అని స్పష్టం చేసింది.
Advertisement
Hardik Pandya
Gujarat Titans
Retention
Mumbai Indians
IPL-2024

More Telugu News