వలస కార్మికురాలి నాలుగు నెలల పసిపాపకు స్తన్యమిచ్చిన కేరళ మహిళా పోలీసు.. కురుస్తున్న ప్రశంసలు

వలస కార్మికురాలి నాలుగు నెలల పసిపాపకు స్తన్యమిచ్చిన కేరళ మహిళా పోలీసు.. కురుస్తున్న ప్రశంసలు

Kerala policewoman breastfeeds infant of ill migrant labourer and wins hearts
  • గుండెలో వాల్వ్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన కార్మికురాలు
  • ఆసుపత్రిలో ఆకలితో అల్లాడిపోయిన ఆమె నలుగురు పిల్లలు
  • పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ఆహారం అందించిన వైనం
  • కానిస్టేబుల్ శైలజన్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు
ఆమె పేరు ఆర్య శైలజన్. కేరళలోని కొచ్చిలో ఓ మహిళా పోలీసు అంతే. ఆమె గురించి అంతకుమించి చెప్పుకోవడానికేం లేదు. కానీ ఇప్పుడు శైలజన్ గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. అంతగా ఆమె చేసిన ఘనకార్యం ఏమిటనేదే మీ ప్రశ్న అయితే.. ఈ వార్తను చదివేయాల్సిందే.

పోలీస్ కంట్రోల్ రూముకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హార్ట్‌లో వాల్వ్ సమస్యతో ఓ వలస కార్మికురాలు ప్రభుత్వాసుపత్రిలో చేరిందని, ఆమె నలుగురు చిన్నారులు కూడా అక్కడే ఏడుస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని, వారి వద్ద మరెవరూ లేరనేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. వెంటనే ఆసుపత్రికి చేరుకున్న సిబ్బంది ఆ చిన్నారులను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. 

వారిలో ముగ్గురి వయసు 13, 5, 2 ఏళ్లు కాగా, మరో పసిపాప వయసు నాలుగు నెలలు. వారందరూ ఆకలితో అలమటించిపోతున్నారు. ఆ అమ్మాయిని చూసి గుండె తరుక్కుపోయిన శైలజన్ వెంటనే తన పై అధికారికి ఆ విషయం చెబుతూ ఆ చిన్నారికి తాను పాలిస్తానని చెప్పారు. అందుకు ఆయన కూడా అంగీకరించడంతో వెంటనే ఆమె పాలుపట్టి ఆ పాప ఆకలి తీర్చారు.

తనకు 9 నెలల పాప ఉందని పేర్కొన్న శైలజ.. ఏడుస్తున్న చిన్నారికి పాలుపట్టి ఆకలి తీర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. పాట్నాకు చెందిన వలస కార్మికురాలికి మొత్తం ఐదుగురు సంతానం కాగా, ఒకరు పాట్నాలోనే ఉన్నారు. ఆమె భర్త ఓ నేరంపై కొచ్చిలోనే జైలులో ఉన్నాడు. వలస కార్మికురాలి పాపకు తన స్తన్యమిచ్చి ఆకలి తీర్చిన శైలజన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
Advertisement
Sailajan
Kochi Police Woman Sailajan
Sailajan Brestfeeding
Lobour Woman

More Telugu News