ఆ ముగ్గురికి సిగ్గు, శరం ఉన్నాయా?: వెల్లంపల్లి శ్రీనివాస్
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై వెల్లంపల్లి విమర్శలు
- విజయవాడలో అత్యధిక రోడ్లు వేసింది తమ ప్రభుత్వమేనని వ్యాఖ్య
- దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలని వ్యాఖ్య
రూ. 400 కోట్లతో కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టిన ఘనత సీఎం జగన్ దని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ దిక్కుమాలిన రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పారు. తెలంగాణలో ఎనిమిది మందిని పోటీకి నిలబెట్టి సొంత పార్టీని పవన్ నట్టేట ముంచేశారని అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లారని... లోకేశ్ ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే నారా భువనేశ్వరి ఓదార్పు యాత్రను వదిలేశారని ఎద్దేవా చేశారు.