కోహ్లీతో క్రికెట్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడిన డేవిడ్ బెక్‌హామ్.. వీడియో ఇదిగో!

కోహ్లీతో క్రికెట్ స్టేడియంలో ఫుట్‌బాల్ ఆడిన డేవిడ్ బెక్‌హామ్.. వీడియో ఇదిగో!

David Beckham Plays Football With Kohli In Wankhede
  • భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు ముందు ఘటన
  • బెక్‌హామ్ వైపు ఫుట్‌బాల్ విసిరిన కోహ్లీ
  • సచిన్‌తో కలిసి ప్రపంచకప్‌తో స్టేడియంలో బెక్‌హామ్ పరేడ్
భారత్-న్యూజిలాండ్ మధ్య నిన్న జరిగిన సెమీస్ మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియంలో కోహ్లీతో కలిసి ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ ఫుట్‌బాల్ ఆడాడు. రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడైన బెక్‌హామ్ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ గ్రేట్ సచిన్‌తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీతో స్టేడియంలో పరేడ్ చేశాడు. 

స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ.. సచిన్‌తో కలిసి నడుస్తున్న బెక్‌హామ్ వైపుగా ఫుట్‌బాల్‌ విసిరాడు. అది చూసిన బెక్‌హామ్ దానికి కిక్ ఇస్తూ తిరిగి కోహ్లీవైపు పంపాడు. ఇలా కాసేపు ఇద్దరూ ఫుట్‌బాల్ ఆడుకున్నారు. మ్యాచ్‌కు ముందు ఇద్దరూ కాసేపు చాట్ చేసుకున్నారు కూడా. బెక్‌హామ్ ప్రస్తుతం యూనిసెఫ్ రాయబారిగా ఉన్నాడు. సచిన్ కూడా అందులో ఓ పాత్ర పోషిస్తున్నాడు.
Advertisement
David Beckham
Virat Kohli
Sachin Tendulkar
Wankhede Stadium
Football

More Telugu News