పనిమనిషి కూతురు కోసం తల్లడిల్లిన సన్నీలియోన్
- 8వ తేదీన మిస్ అయిన సన్నీ పనిమనిషి కూతురు
- అమ్మాయిని వెతికి తీసుకొచ్చిన వారికి రూ. 50 వేల బహుమతి ఇస్తానన్న సన్నీ
- అమ్మాయి దొరికిందంటూ మరో పోస్ట్ చేసిన సన్నీ
మరోవైపు... తప్పిపోయిన చిన్నారి అనుష్క దొరికింది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ ప్రకటించింది. పాప దొరికింది అంటూ ఆమె మరో పోస్ట్ చేసింది. ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని తెలిపింది. ముంబై పోలీసులుకు ధన్యవాదాలు తెలియజేసింది. 24 గంటల్లోనే అనుష్క దొరికిందని.. ఆమె కోసం తాను పెట్టిన పోస్ట్ ను షేర్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, పనిమనిషి కూతురు కోసం సన్నీ పడిన తపనను చూసిన నెటిజెన్లు ఆమెను ప్రశంసిస్తూ మెసేజ్ లు పెడుతున్నారు.