ఫిలిం డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు
- రికార్డింగ్, రీరికార్డింగ్ థియేటర్ల నిర్మాణం కోసం భూమి కేటాయింపు
- వాణిజ్య అవసరాలకు వాడుకున్నారంటూ 2012లో పిల్
- ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా రికార్డుల్లో నమోదు కాని వైనం
- తాజాగా మరోసారి రాఘవేంద్రరావు, ఆయన బంధువులకు హైకోర్టు నోటీసులు
మెదక్‌కు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వే నెం.403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు (ఆర్కే సినీప్లెక్స్) వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌లతో కూడిని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన రాఘవేంద్రరావు, ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలస దేవికి నోటీసులిచ్చింది.