45 మందితో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Advertisement

45 మందితో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Telangana Congress releases 2nd list
  • నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • జోరుమీదున్న కాంగ్రెస్
  • ఇటీవల 55 మందితో తొలి జాబితా
  • నేడు పలువురు సీనియర్ నేతలతో కూడిన రెండో జాబితా ప్రకటన
తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్... నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు. 

అభ్యర్థుల జాబితా...

1. రావి శ్రీనివాస్- సిర్పూర్
2. అజ్మీరా శ్యామ్- ఆసిఫాబాద్
3. వెడమ బొజ్జు- ఖానాపూర్
4. కంది శ్రీనివాస్ రెడ్డి- ఆదిలాబాద్
5. వెన్నెల అశోక్- బోధ్
6. నారాయణరావు పాటిల్- ముథోల్
7. మదన్ మోహన్ రావు- ఎల్లారెడ్డి
8. భూపతిరెడ్డి- నిజామాబాద్ రూరల్
9. జువ్వాడి నరసింగరావు- కోరుట్ల
10. మేడిపల్లి సత్యం- చొప్పదండి
11. వడితల ప్రణవ్- హుజూరాబాద్
12. పొన్నం ప్రభాకర్- హుస్నాబాద్
13. పూజల హరికృష్ణ- సిద్ధిపేట
14. ఆవుల రాజిరెడ్డి- నర్సాపూర్
15. చెరుకు శ్రీనివాస్ రెడ్డి- దుబ్బాక
16. బండి రమేశ్- కూకట్ పల్లి
17. మధుయాష్కీ గౌడ్- ఎల్బీనగర్
18. మల్ రెడ్డి రంగారెడ్డి- ఇబ్రహీంపట్నం
19. కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి- మహేశ్వరం
20. కస్తూరి నరేందర్- రాజేంద్రనగర్
21. జగదీశ్వర్ గౌడ్- శేరిలింగంపల్లి
22. మనోహర్ రెడ్డి- తాండూరు
23. రోహిన్ రెడ్డి- అంబర్ పేట్
24. విజయారెడ్డి- ఖైరతాబాద్
25. మహ్మద్ అజారుద్దీన్- జూబ్లీహిల్స్
26. జీవీ వెన్నెల- సికింద్రాబాద్ కంటోన్మెంట్
27. వాకిటి శ్రీహరి- మక్తల్
28. చిన్నారెడ్డి- వనపర్తి
29. బాలూ నాయక్- దేవరకొండ
30. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మునుగోడు
31. కుంభం అనిల్ కుమార్ రెడ్డి- భువనగిరి
32. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి- జనగామ
33. యశస్విని- పాలకుర్తి
34. మురళీ నాయక్- మహబూబాబాద్
35. రేవూరి ప్రకాశ్ రెడ్డి- పరకాల
36. నాయిని రాజేందర్ రెడ్డి- వరంగల్ వెస్ట్
37. కొండా సురేఖ- వరంగల్ ఈస్ట్
38. నాగరాజు- వర్ధన్నపేట
39. పాయం వెంకటేశ్వర్లు- పినపాక
40. ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు
41. పొంగులేటి శ్రీనివాసరెడ్డి- పాలేరు
42. పరిణికా రెడ్డి- నారాయణపేట్
43. యెన్నం శ్రీనివాస్ రెడ్డి- మహబూబ్ నగర్
44. అనిరుధ్ రెడ్డి- జడ్చర్ల
45. మధుసూదన్ రెడ్డి- దేవరకద్ర


Advertisement
Congress
2nd List
Assembly Election
Telangana

More Telugu News