ఇక ప్రజాక్షేత్రంలోకి.. నారా భువనేశ్వరి కీలక నిర్ణయం!
- నిజం గెలవాలి పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్న భువనేశ్వరి
- వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటన
- వారానికి కనీసం రెండుమూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు
అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్‌తో ఆగిపోయిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కూడా మళ్లీ ప్రారంభించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొంటారు. ప్రస్తుతం లోకేశ్ యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక తిరిగి పాదయాత్ర చేపడతారు. అప్పటి వరకు భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.