అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య భువనేశ్వరి: వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి

అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య భువనేశ్వరి: వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి

YSRCP MLC satires on Nara Bhuvaneswari
  • చంద్రబాబు అవినీతిపరుడు, దుర్మార్గుడని ఎన్టీఆరే చెప్పారని వ్యాఖ్య
  • నీతిమంతులమని చంద్రబాబు కుటుంబం చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శ
  • అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా
  • మీకు రూ.57 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్న
అబద్ధాలు చెప్పడంలో నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అతిపెద్ద అవినీతిపరుడు, దుర్మార్గుడని స్వర్గీయ ఎన్టీఆరే చెప్పారన్నారు. పదేపదే మేం నీతిమంతులమని నారా కుటుంబం చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, భువనేశ్వరి కుటుంబానికి ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో చంద్రబాబు, తాము ఉన్నామని వారే చెప్పుకుంటున్నట్లుగా ఉందన్నారు. తమ కుటుంబం ఏనాడు అవినీతి చేయలేదని, ప్రజల సొమ్ముకు ఆశపడలేదని చెబుతున్నారని, కానీ చంద్రబాబు అవినీతిపరుడని మీ తండ్రి చెప్పిన విషయం మరిచిపోయారా? అని నిలదీశారు.

చంద్రబాబు వంటి అవినీతిపరుడి కోసం మీరు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అనే టైటిల్ పెడితే మీ కుటుంబానికి సరిగ్గా సరిపోతుందని భువనేశ్వరిని ఉద్దేశించి అన్నారు. అక్రమాస్తులు లేవని భువనేశ్వరి పదేపదే చెబుతున్నారని, అయితే 2016లో మీ కుటుంబం ఆస్తి రూ.57 కోట్లు అయితే, ఇప్పుడు హెరిటేజ్‌లో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తాయని చెబుతున్నారని, దీని ప్రకారం మీ ఆస్తి రూ.20 వేల కోట్లుగా ఉందన్నారు. అవినీతి చేయకుంటే ఇంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు.

హెరిటేజ్ వేరే వారి నుంచి తీసుకున్నారని, ఇదివరకు ఉన్న లింగమనేని హౌస్ వేరేవారిదని, మీ పార్టీ కూడా అక్రమంగా ఎన్టీఆర్ నుంచి తీసుకున్నారన్నారు. మాట్లాడితే నీతిగా బతికేవాళ్లమని చెబుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు.
Advertisement
kalyani
YSRCP
Nara Bhuvaneswari
Chandrababu

More Telugu News