నేను శ్రీదేవిని రెండుసార్లు పెళ్లి చేసుకున్నాను... అందుకే జాన్వీ పుట్టినరోజుపై గందరగోళం: బోనీ కపూర్
- జాన్వీ కపూర్ పుట్టినరోజుపై మీడియాలో ప్రచారం
- బోనీ, శ్రీదేవిలకు పెళ్లికి ముందే పుట్టిందంటూ కథనాలు
- శ్రీదేవిని రెండుసార్లు పెళ్లాడడం వల్ల గందరగోళం నెలకొందన్న బోనీ
- 1996లో మొదట రహస్యంగా పెళ్లాడానని వెల్లడి
- 1997 జనవరిలో అందరికీ తెలిసేలా పెళ్లాడానని వివరణ
- 1997 మార్చిలో జాన్వీ పుట్టిందని స్పష్టీకరణ
వాస్తవానికి శ్రీదేవిని తాను మొదట 1996లో పెళ్లాడానని బోనీకపూర్ స్పష్టం చేశారు. ఆ పెళ్లి షిర్డీలో జరిగిందని తెలిపారు. షిర్డీలో రహస్యంగా పెళ్లి చేసుకున్న విషయాన్ని కొన్ని నెలల తర్వాత మీడియా ఎదుట ప్రకటించామని వెల్లడించారు. ఆ తర్వాత 1997 జనవరిలో శ్రీదేవిని మరోసారి పెళ్లి చేసుకున్నానని, ఈ పెళ్లి అందరికీ తెలిసే జరిగిందని బోనీ వివరించారు.
ఇక, 1997 మార్చిలో జాన్వీ పుట్టిందని తెలిపారు. 1996లోనే తమ పెళ్లి జరిగిందని, తమ పెళ్లి జరిగిన తర్వాతే జాన్వీ పుట్టిందన్న విషయాన్ని మీడియా ఇకనైనా గుర్తించాలని హితవు పలికారు.