జైల్లో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, చినరాజప్ప

జైల్లో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, చినరాజప్ప

Nara Bhuvaneswari Brahmani and Chinarajappa to meet Chandrababu
  • స్కిల్ కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు
  • ములాఖత్ ద్వారా కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి
  • రాజకీయ కార్యాచరణపై చంద్రబాబు సూచనలు చేసే అవకాశం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, సీనియర్ నేత, మాజీ మంత్రి చినరాజప్ప కలిశారు. ములాఖత్ ద్వారా వారు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలనే దానిపై వీరికి చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు, నిన్న చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధరతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ దీక్షలో కూర్చున్నారు.
Advertisement
Chandrababu
Telugudesam
Nara Bhuvaneswari
Nara Brahmani
Nimmakayala Chinarajappa

More Telugu News