ఢిల్లీ పోలీసుల అదుపులో కరుడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది
- షఫీ ఉజామాను అరెస్ట్ చేసిన పోలీసులు
- పూణె మాడ్యూల్ కేసులో అతడు కీలక నిందితుడు
- ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు అనుమానం
ఢిల్లీకి చెందిన షఫీ ఉజామా వృత్తి రీత్యా ఇంజనీర్. పూణే కేసులో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న అతడు ఢిల్లీలో తలదాచుకుంటున్నాడు. విదేశాల్లోని వారి ఆదేశాలకు అనుగుణంగా ఉత్తరాదిన ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఐఈడీల తయారీలో వినియోగించే పలుడు పేలుడు పదార్థాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. షఫీ ఉజామా, మరో ఇద్దరిని పుణె మాడ్యూల్ కేసులో కొత్రూడ్ పోలీసులు జూలై 18న అరెస్ట్ చేశారు. పోలీసు వాహనం నుంచి షఫీ కిందకు దూకేసి తప్పించుకోగా, ఇన్నాళ్లకు మళ్లీ చిక్కాడు.