హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్న జాన్వీ కపూర్
Add ap7am to your home Screen

హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో ఇల్లు కొనుక్కున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor purchased home in Hyderabad
  • 'దేవర'లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న జాన్వీ
  • దక్షిణాదిపై దృష్టి సారిస్తున్న బాలీవుడ్ బ్యూటీ
  • కొన్ని రోజులు హైదరాబాద్, కొన్ని రోజులు ముంబైలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్న వైనం
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీద ఉంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను జాన్వీ సొంతం చేసుకుంది. ఇప్పుడు దక్షిణాదిపై ఆమె దృష్టి సారించింది. టాలీవుడ్ నుంచి ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'దేవర' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చేపలు పట్టే కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రను జాన్వీ పోషిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంతో, హైదరాబాద్ లో రూ. 3 కోట్లతో ఒక ఇంటిని ఆమె కొన్నట్టు సమాచారం. త్వరలోనే తన మకాంను హైదరాబాద్ కు మారుస్తుందని చెపుతున్నారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ముంబైలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుందని సమాచారం. సౌత్ లో బిజీ అయితే ఎక్కువ రోజులు ఉండేందుకు హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిందని చెపుతున్నారు.
Advertisement
Janhvi Kapoor
Bollywood
Tollywood
Hyderabad
Home

More Telugu News