ఇక విశ్రాంతి తీసుకుంటా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్
- 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా
- 12 సార్లు పోటీచేసి ఆరుసార్లు గెలిచాను
- నేను ఇక ఎక్కువ కష్టపడలేనని, వదిలేయాలని జగన్‌కు చెప్పా
- ఈ ఒక్కసారికి పోటీ చేయమని సీఎం చెప్పారు
- శ్రీకాకుళం మంత్రి ధర్మాన వ్యాఖ్యలు
తాను 12 సార్లు పోటీచేసి ఆరుసార్లు విజయం సాధించానని, గెలుపోటములతో పెద్దగా తేడా ఉండదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదిస్తే గెలిచి మీ సేవకుడిగా ఉంటానని, ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని చెప్పారు. తనకు ఈ గౌరవం దక్కడానికి మీరే కారణమని, కాబట్టే ఈ విషయాలన్నీ మీతో చెబుతున్నానని ధర్మాన వివరించారు.