ప్రియుడితో వెళ్లి తిరిగొచ్చిన భార్య.. ముక్కు కొరికేసిన భర్త!
- ప్రియుడితో వెళ్లి రెండున్నర నెలల తర్వాత తిరిగొచ్చిన భార్య
- ఆమే తన ప్రైవేట్ భాగాలను కొరికిందని భర్త ఫిర్యాదు
- పది సంవత్సరాల క్రితం వివాహం, ముగ్గురు సంతానం
పదేళ్లు కలిసి కాపురం చేశారు... ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు... కానీ, వారి సంసార బంధంలో నమ్మకం అనే పునాది కదిలిపోయింది. ప్రియుడి మోజులో భార్య దారితప్పితే, తిరిగివచ్చిన ఆమెను క్షమించలేని భర్త దారుణంగా ప్రవర్తించాడు. క్షణికావేశం, పంతం, పగ వారి బంధాన్ని పాతాళానికి తొక్కేశాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు.
తన ముక్కు కొరికి భర్త పైశాచిక ఆనందం పొందాడని ఆమె ఆరోపిస్తుంటే, అసలు దాడికి దిగింది ఆమేనని, భర్త మర్మాంగాలను కొరికిందని అతడి కుటుంబం ఎదురుదాడికి దిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన, చిన్నాభిన్నమైన కుటుంబ వ్యవస్థకు అద్దం పడుతోంది.
దీపక్, సాధన (27) దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో, సుమారు రెండున్నర నెలల క్రితం సాధన అదృశ్యమైంది. తన భర్త స్నేహితుడితోనే ఆమె వెళ్లిపోయిందని తెలియడంతో దీపక్ కుమిలిపోయాడు. అప్పట్లో ఈ విషయంపై పోలీస్ పంచాయితీ జరిగినా, సమస్య సద్దుమణగలేదు.
అయితే, గురువారం కథ అనూహ్య మలుపు తిరిగింది. సాధన పక్కింటి పైకప్పు మీద నుంచి దూకి, నాటకీయ ఫక్కీలో భర్త ఇంట్లోకి ప్రవేశించింది. ఆమె రాకతో ఇంట్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. మాటల యుద్ధం కాస్తా దాడికి దారితీసింది. "నన్ను చూసిన వెంటనే భర్త దీపక్, అత్తమామలు దాడికి పాల్పడ్డారు. నా చేతులను వారు గట్టిగా పట్టుకోగా, భర్త నా ముక్కును కొరికి, దాన్ని మురుగు కాలువలో పడేశాడు" అని బాధితురాలు సాధన కన్నీటిపర్యంతమైంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను వెంటనే హర్దోయి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
సాధన ఆరోపణలు తీవ్రంగా ఉండగా, భర్త దీపక్ కుటుంబం చెబుతున్న కథనం పూర్తి భిన్నంగా ఉంది. "సాధన హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి పిల్లలను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. మేము అడ్డుకోవడంతో మాపైనే దాడికి దిగింది. ఈ క్రమంలోనే నా కొడుకు దీపక్ మర్మాంగాలను కొరికి తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత తనను తాను గాయపరుచుకునేందుకు, సానుభూతి పొందేందుకు తలను నేలకేసి కొట్టుకుంది" అని దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాధన ఇప్పటివరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు వారి ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నారు.