ధర్మవరంలో మత సామరస్యం... వినాయక లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
- ధర్మవరంలో వినాయక లడ్డూ వేలంపాట
- రూ.1.45 లక్షలకు ప్రసాదాన్ని దక్కించుకున్న ముస్లిం దంపతులు
- మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘటన
- దంపతులను సన్మానించిన ఉత్సవ కమిటీ
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు రూ.1,45,000 చెల్లించి ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
పట్టణంలోని పార్థసారథి నగర్, సిరికల్చర్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం ఉత్సవ కమిటీ లడ్డూ వేలంపాట నిర్వహించింది. ఈ వేలంలో పలువురు పోటీ పడగా, చివరికి చాందిని, మస్తాన్ వలి దంపతులు అత్యధిక ధరకు లడ్డూను గెలుచుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో లడ్డూ వేలం వేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని బాలాపూర్ లడ్డూ వేలం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.