వినాయకచవితి జరుపుకోలేదు.. తిండి కూడా తినాలనిపించడం లేదు: బండ్ల గణేశ్
- చంద్రబాబు అరెస్ట్ ఎంతో బాధించిందన్న బండ్ల గణేశ్
- జాతీయ సంపద అయిన చంద్రబాబును కాపాడుకోవాలని విన్నపం
- అందరూ సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని సూచన
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని... ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని బండ్ల గణేశ్ అన్నారు. హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా... సొంతూళ్లలో బొడ్రాయి ముందు కూర్చోని ధర్నాలు చేయాలని సూచించారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే... తనకు ఆహారం కూడా తీసుకోవాలనిపించడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఖాయమని, చంద్రబాబు మరోసారి సీఎం అవుతారని జోస్యం చెప్పారు.