కన్నీళ్ల మధ్య అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!
- పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామంలో విషాదం
- పండుగ పూట గుండె పోటుతో అన్న మృతి
- రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరి కన్నీటిపర్యంతం
ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాఖీ పండగ సందర్భంగా కనకయ్య సోదరి గౌరమ్మ అన్న ఇంటికి వచ్చింది. సోదరుడికి రాఖీ కట్టి వెళదామని వచ్చిన గౌరమ్మ.. అన్న హఠాన్మరణంతో గుండెలవిసేలా రోదించింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోయింది. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది.