స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda interview will telecast on Star Sports Telugu
  • విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి
  • సెప్టెంబరు 1న రిలీజ్
  • ప్రమోషన్స్ తో విజయ్ బిజీ
  • స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో విజయ్ ఇంటర్వ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్లో సందడి చేయనున్నారు. ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు.

ఆగస్టు 30న ఆసియా కప్ ప్రారంభం కానుండగా, కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ విజయ్ దేవరకొండతో చిట్ చాట్ ప్రసారం చేయనుంది. ఈ ఇంటర్వ్యూను డిస్నీ ప్లస్ హాట్  స్టార్ లోనూ చూడొచ్చు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ ప్రోమో విడుదల చేసింది. 

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల  ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.
Go Back to Shorts
Vijay Devarakonda
Star Sports Telugu
Khushi
Asia Cup

More Telugu News