ఒక్క త్రో... రెండు ఘనతలు... నీరజ్ చోప్రా మరో సంచలనం
- హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో వరల్డ్ చాంపియన్ షిప్
- నేడు జావెలిన్ ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా
- వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత యువకెరటం
- అదే ఊపులో పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన వైనం
వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ కు పురుషుల జావెలిన్ త్రో అర్హత మార్కు 85.50 మీటర్లు కాగా, మనవాడు 3 మీటర్లు ఎక్కువే విసిరాడు. వరల్డ్ చాంపియన్ షిప్ క్వాలిఫయింగ్ మార్కు 83 మీటర్లు కాగా, 5 మీటర్లు ఎక్కువే విసిరిన నీరజ్ చోప్రా మరో అంతర్జాతీయ టైటిల్ కు గురిపెట్టాడు.
వరల్డ్ చాంపియన్ షిప్ లో గ్రూప్-ఏలో ఉన్న చోప్రా... క్వాలిఫయింగ్ రౌండ్ లో అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా ఇవాళ తొలి ప్రయత్నంలోనే సీజన్ బెస్ట్ నమోదు చేయడం విశేషం.