హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ జనరల్ మేనేజర్ హత్య
- మదీనాగూడలోని సందర్శినీ ఎలైట్ రెస్టారెంట్ జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్‌పై కాల్పులు
- దేశవాళీ తుపాకీతో ఆరు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయిన ఆగంతుకులు
- తీవ్ర రక్తస్రావమై ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోయిన బాధితుడు
- ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
- పాతకక్షలతోనే దేవేందర్‌ను హత్యచేసుంటారని పోలీసుల ప్రాథమిక అంచనా
హత్యకు గల కారణాలు ఏమిటో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలే దేవేందర్ హత్యకు దారి తీసి ఉంటాయని వారు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని మాదాపూర్ జోన్ డీసీపీ సందీప్ రావు తెలిపారు.