విజయ్ దేవరకొండ పెళ్లాడే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఇవే: సమంత

Samatha talks about vijays would be life partner qualities
  • సమంత, విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ వచ్చే నెల 1న విడుదల
  • ప్రచార కార్యక్రమాల్లో బిజీగా బిజీగా హీరోహీరోయిన్లు
  • తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్, సమంత
  • విజయ్‌కు కాబోయే భార్య సింపుల్‌గా, అతడి కుటుంబంతో కలిసిపోయేలా ఉండాలన్న సమంత
  • సమంత అభిఫ్రాయంతో ఏకీభవించిన విజయ్
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషీ’ వచ్చే నెల 1వ తారీఖున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నటీనటులతో సహా చిత్ర బృందం విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సామ్, విజయ్ దేవరకొండ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయ్‌కు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో సమంత చెప్పుకొచ్చింది. ‘‘ఆమె చాలా సింపుల్‌గా ఉండాలి. అతడి కుటుంబంతో సులువుగా కలిసిపోవాలి’’ అని సమంత చెప్పగా విజయ్ కూడా అంగీకరించాడు. 

ఇక సమంత విజయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంది. విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేస్తాడని చెప్పింది. గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడని, అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ అని కూడా పేర్కొంది. సమంత గురించి కూడా విజయ్ పలు విషయాలు చెప్పాడు. రాహుల్ రవీంద్రన్, చిన్మయి, నీరజ కోన, మేఘన.. సమంత బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపాడు. సమంతకు కోపం కట్టలు తెంచుకున్నా అసభ్యంగా మాట్లాడదని చెప్పాడు.
Advertisement
Samantha
Vijay Devarakonda

More Telugu News