మైసూరులో 'వృషభ' యాక్షన్ సన్నివేశాలు... సెట్స్ పైకి మోహన్ లాల్
- హెలికాప్టర్ లో మైసూరు చేరుకున్న మోహన్ లాల్
- నందకిశోర్ దర్శకత్వంలో వృషభ
- చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలు
- వృషభ టీమ్ లో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో భాగస్వామ్యం
హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత నిక్ తుర్లో వృషభ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడంతో సినిమా రేంజి మరింత పెరిగింది. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిలింస్, ఏవీఎస్ స్టూడియోస్ వంటి బాలీవుడ్ అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ చిత్రంలో మోహన్ లాల్, రోషన్ మేకా తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. శ్రీకాంత్, షనాయా కపూర్, జహ్రాఖాన్, రాగిణి ద్వివేది తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.