కుక్కను మచ్చిక చేసుకుని.. ఖరీదైన సైకిల్ చోరీ.. వీడియో
- సైకిల్ తీసుకెళుతుండగా అడ్డు పడిన శునకం
- దాంతో స్నేహంగా మెలిగి చోరీ
- వీడియో క్లిప్ విడుదల చేసిన పోలీసులు
వచ్చీ రాగానే కొత్త వ్యక్తి దగ్గరకు వెళ్ళింది. కుక్కను చూసిన ఆ దొంగ, పారిపోవడం కంటే దాన్ని మచ్చిక చేసుకోవడం మంచి ఉపాయంగా భావించాడు. సైకిల్ ను తిరిగి ముందున్న చోటే పార్క్ చేసి.. శునకాన్ని దగ్గరకు తీసుకున్నాడు. అది మాత్రం అతడ్ని విడిచి పెట్టడం లేదు. ఏదోలా దాన్ని విదిలించుకుని, పార్క్ చేసిన సైకిల్ ను తీసుకుని అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతడినే చూస్తూ ఇంటి గుమ్మం దగ్గరే శునకం ఆగిపోయింది. అలా చూస్తూ ఉన్నట్టుండి మళ్లీ పరుగు ఆరంభించడాన్ని వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియో క్లిప్ ను శాన్ డియాగో పోలీసులు తమ ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. 2019 సంవత్సరానికి చెందిన బ్లాక్ ఎలెక్ట్రా 3 స్పీడ్ సైకిల్ చోరీకి గురైనట్టు గుర్తించారు. దాని ధర 1,300 డాలర్లు (సుమారు రూ.లక్ష) ఉంటుందని ప్రకటించారు. దొంగ కోసం గాలిస్తున్నారు. (వీడియో కోసం)