లగ్జరీలు కావాలని మేము అడగలేదు: వెస్టిండీస్ బోర్డ్ పై హార్ధిక్ పాండ్యా విమర్శలు
- తమకు వసతులు కల్పించడంలో విండీస్ బోర్డు విఫలమయిందన్న పాండ్యా
- ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచన
- తదుపరి టూర్ లో అయినా కనీస వసతులు కల్పించాలని విన్నపం
మరోవైపు వెస్టిండీస్ బోర్డుపై హర్ధిక్ పాండ్యా విమర్శలు గుప్పించాడు. తమకు కనీస వసతులు కల్పించడంలో విండీస్ మేనేజ్ మెంట్ విఫలమయిందని విమర్శించాడు. తమకు లగ్జరీలు కావాలని తాము కోరడం లేదని... తదుపరి జరిగే టూర్ లో అయినా తమకు కనీస వసతులను కల్పించాలని కోరాడు. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పాడు.